నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
26 Apr, 2017 15:21 IST
వైయస్ఆర్ జిల్లా : అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోని పరిహారం చెల్లించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షానికి మామిడి, బొప్పాయి, అరటి తోటలు నీటమునిగాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పెనమలూరు మండలంలో పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. గత రెండు వేసవి కాలాల్లో జరిగిన నష్టానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం అందకపోగా చెల్లించినట్లుగా ప్రభుత్వ పెద్దలు మాత్రం గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.