రాజన్న రాజ్యంలో జూట్‌ పరిశ్రమకు మంచిరోజులు

16 Jul, 2013 11:45 IST
బైరిపురం (విజయనగరం జిల్లా),

16 జూలై 2013: రాజన్న కలలు కన్న రాజ్యం రాష్ట్రంలో త్వరలో వస్తుందని, జూట్‌ పరిశ్రమకు మంచిరోజులు వస్తాయని శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు. మరో ప్రజాప్రస్థానం 211వ రోజు మంగళవారం విజయనగరం జిల్లా బైరిపురంలో పాదయాత్ర ప్రారంభమైన సందర్భంగా కొందరు జూట్‌ పరిశ్రమల యజమానులు శ్రీమతి షర్మిలను కలుసుకున్నారు. జూట్ పరిశ్రమల ‌యజమానులు తమ సమస్యలను శ్రీమతి షర్మిలకు విన్నవించారు. జగనన్న నేతృత్వంలో రాజన్న రాజ్యం వచ్చినప్పుడే రైతులు, కార్మికులు, పరిశ్రమల యాజమానులు కష్టాల నుంచి బయటపడతారని శ్రీమతి షర్మిల అన్నారు.

విద్యుత్‌ కష్టాలతో విజయనగరం జిల్లాలో సగానికి పైగా పరిశ్రమలు మూతపడిపోయే ప్రమాదం ఉందని పరిశ్రమల యజమానులు శ్రీమతి షర్మిల వద్ద వాపోయారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు జనుము పంట పండించడం మానేశారన్నారు. దీంతో జూట్ పరిశ్రమకు అవసరమైన ముడిసరుకును పశ్చిమ బెంగా‌ల్ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని పరిశ్రమల యజమానులు ‌ఆమెకు విన్నవించారు.