గోదారమ్మకు ప్రత్యేక పూజలు
12 Jun, 2018 11:43 IST
పశ్చిమ గోదావరి: ప‌్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరిట పాదయాత్రగా బయలుదేరిన వైయస్ జగన్ పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు వద్ద గోదారమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. గోష్పాద క్షేత్రంలో వైయస్ జగన్ గోదారమ్మకు హారతి ఇచ్చారు. ఆలయ సంప్రదాయం ప్రకారం వేద పండితుల ఆధ్వర్యంలో ఆయన గోదారమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్ఛరణల మధ్య జననేత గోదావరమ్మకు హారతినిచ్చారు. అనంతరం ఆలయాన్ని దర్శించుకొని, స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వైఎస్ జగన్‌ను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురవాలని, రైతులు సుఖ సంతోషాలతో గడపాలని పూజలు చేశారు. వైయస్ జగన్ రాకతో గోష్పాద క్షేత్రం జనసంద్రమైంది. ఆయన పాటు పార్టీ సీనియర్ నేతలు వైవీ సుబ్బారెడ్డి, జిల్లా నేతలు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.