నూతన వధూవరులకు జీబీ ఆశీర్వాదం
24 Mar, 2017 10:02 IST
గుడిబండ(మడకశిర): గుడిబండ మండలంలోని హిరేతుర్పి గొల్లహట్టి గ్రామంలో గురువారం చైత్ర, వీరేష్‌ల వివాహం జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీబీ శివకుమార్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. జీబీ వెంట మండల కన్వీనర్ రాజన్న, నాయకులు శశిధర్, నాగరాజు, జంపన్న, భూతరాజు, లక్ష్మీనారాయణ, తమ్మన్న, చిత్తయ్య తదితరులు ఉన్నారు.