ఉచితంగా కంటి అద్దాలు
9 May, 2017 17:42 IST
ఎన్‌పీకుంటః కంటి ఆపరేషన్ చేయించుకున్న వారికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటానని వైయస్‌ఆర్ సీపీ నాయకుడు వజ్ర పౌండేషన్ వ్యవస్థాపకుడు వజ్ర భాస్కర్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత నెలలో కంటి ఆపరేషన్ చేయించుకున్న వారికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ చేయించుకున్న ప్రతీ ఒక్కరికి తన ఫోన్ నెంబర్‌తో పాటు రశీదులు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ నెల 26న కదిరి డివిజన్‌లో ఆపరేషన్ చేయించుకున్న 800మందికి ఉచితంగా కంటి అద్దాలను అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్ సీపీ నాయకులు రఘునాథ్, తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.