సూత్రధారి చంద్రబాబే..! ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు..?
6 Sep, 2015 10:25 IST
హైదరాబాద్: ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు గుట్టు రట్టు అవుతోంది. మన వాళ్లు బ్రీఫ్ డ్ మీ అన్న గొంతు చంద్రబాబుదే అని నిర్ధారణ అవుతోంది. ఈ టేపుల్ని పరిశీలించిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ ఈ మేరకు తన నివేదికను సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక New Indian Express ప్రచురించిన కథనం ప్రకారం చంద్రబాబు వాయిస్ ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ నిర్ధారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే 10 రోజుల్లోపు ఎప్పుడైనా ఏసీబీ కోర్టుకి ఈ నివేదిక అందే అవకాశం ఉంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు మీద కోర్టు అనుమతితో ఏసీబీ అధికారులు తదుపరి చర్యలు తీసుకొనే అవకాశం ఉంది.
వాయిస్ ను నిర్ధారించేందుకు చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడిన రికార్డింగ్ లు తీసుకొన్నట్లు తెలుస్తోంది. పదాల మధ్య ఉండే విరామాలు, శబ్ద పౌనః పున్యం, పలికే తీరు వంటి వివరాల ఆధారంగా రిపోర్టు రూపొందించినట్లు సమాచారం. ఒకసారి ల్యాబ్ నుంచి రిపోర్టు అందితే, ఏసీబీ వర్గాలు దర్యాప్తును ముమ్మరం చేస్తారని భావిస్తున్నారు.
For New Indian Express Report:
http://www.newindianexpress.com/states/andhra_pradesh/FSL-to-Tell-Court-Naidu-is-The-Brain-Behind-Cash-for-Vote-Bribery-in-Telangana/2015/09/06/article3012902.ece