జననేతకు వినతులు వెల్లువ
15 May, 2018 13:15 IST
అన్నా.. మా సమస్యలు చూడండీ అంటూ జనావేదన
రాజన్న పాలన తీసుకువస్తానంటూ ధైర్యం చెబుతున్న వైయస్ జగన్
పశ్చిమగోదావరి: ఏలూరు నియోజకవర్గంలో అడుగుపెట్టిన ప్రజా సంకల్పయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పాదయాత్ర చేస్తున్న వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల నుంచి సమస్యల వినతులు వెల్లువలా వస్తున్నాయి. రేషన్ అందడం లేదని కొందరు.. పెన్షన్ ఇవ్వడం లేదని మరికొందరు.. సంక్షేమ పథకాలు టీడీపీ వారికి ఇస్తున్నారని ఇంకొందరు.. మా సమస్యలను పట్టించుకోవడం లేదని రేషన్ డీలర్లు, వాయిద్య కళాకారులు, మాజీ సైనికులు ఇలా అంతా కలిసి జననేతకు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. ఇంకా ఒక్క సంవత్సరం ఓపిక పట్టండి.. మన ప్రభుత్వం వస్తుంది.. ప్రజల ప్రభుత్వం వస్తుంది. వైయస్‌ఆర్ సీపీ అధికారంలోకి వస్తే దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అందించిన సువర్ణ పాలనను తిరిగి తీసుకువస్తానని ప్రజలకు హామీ ఇస్తూ వైయస్ జగన్ ముందుకు సాగుతున్నారు.