బాబు, మోదీ ఫిక్సింగ్ రాజకీయాలు
16 Aug, 2016 13:23 IST
హైదరాబాద్ః విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకుండా చంద్రబాబు, మోదీ బ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తోందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. ప్రత్యేకహోదాపై సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన హామీల కోసం బాబు ఎందుకు పోరాటం చేయడం లేదని, ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయాలపై అన్యాయాలు చేస్తున్నాయని నిప్పులు చెరిగారు.