'ఫీజు'పై వైయస్ఆర్ సిపి వాయిదా తీర్మానం
17 Sep, 2012 03:17 IST
హైదరాబాద్, 17 సెప్టెంబర్ 2012: రాష్ట్రంలోని పేద బీసీ, ఈబీసీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్_మెంట్ అమలు చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. విద్యుత్ సమస్యపై టీడీపీ, తెలంగాణ తీర్మానం పెట్టాలంటూ టీఆర్ఎస్, తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న కుటుంబాలకు పెన్షన్లు ఇవ్వాలని సీపీఐ, తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా పాటించాలని బీజేపీ, పేద విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్_మెంట్ అమలు చేయాలని ఎంఐఎం వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి.