సాగునీరు ఇచ్చి రైతులను ఆదుకోవాలి
19 Aug, 2016 17:43 IST
మాచర్ల :
నాగార్జున సాగర్ కుడికాలువ పరిధిలోని రైతుల పంటలను కాపాడడం కోసం.... నీటి విడుదలను కొనసాగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోరారు. రెండేళ్లుగా సాగర్ కుడి కాలువ రైతులు నీటి కొరతతో పంటలు సరిగా పండించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండే పరిస్థితి నెలకొన్నందున సాగర్ రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో పెరిగిందన్నారు. సాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న రైతులను ఆదుకునేందుకు ...కృష్ణా బోర్డు అధికారులతో చర్చించి కుడికాలువ పరిధిలోని రైతులకు పంట నీరు అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.