వైయస్ఆర్‌సీపీ మున్సిపల్ ఎన్నికల గుర్తు ఫ్యాన్
5 Mar, 2014 12:40 IST
హైదరాబాద్:
మున్సిపల్ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి గుర్తుగా ‘ఫ్యాన్’ను రాష్ట్ర ఎన్నికల సంఘం కేటాయించింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత జరిగిన పలు అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల ఉపఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపైనే అభ్యర్థులు ఘన విజయం సాధించారు. దాని ఆధారంగా పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) కామన్ సింబల్ కేటాయించిన విషయం తెలిసిందే.
తాజాగా రాష్ట్రంలో ఈ నెల 30 జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి గుర్తుగా ఫ్యాన్ కేటాయించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.