ఏపీలో దుష్ట పరిపాలన
20 Mar, 2017 12:10 IST
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుష్టపరిపాలన సాగుతుందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు. తిరుపతిలో భూమన మీడియాతో మాట్లాడుతూ...శాసన మండలి ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ రూ.100 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. ఇది వరకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన టీడీపీ ఇప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసేందుకు తెర లేపారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఫైర్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణ మాయని మచ్చగా భూమన అభివర్ణించారు.