ఎర్రన్నాయుడు మృతికి విజయమ్మ దిగ్ర్భాంతి
2 Nov, 2012 09:13 IST
హైదరాబాద్ :
తెలుగుదేశం పార్టీ నాయకుడు, సీనియర్ పార్లమెంటేరియన్ ఎర్రన్నాయుడు మృతికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ఎర్రన్నాయుడు సుదీర్ఘ కాలం రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో తనదైన పాత్ర నిర్వహించారని ఆమె పేర్కొన్నారు. ఎర్రన్నాయుడు కుటుంబ సభ్యులకు వైయస్ విజయమ్మ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.