ఎమ్మెల్సీ జూపూడికి మాతృ వియోగం
10 Oct, 2012 06:06 IST
హైదరాబాద్, 10 అక్టోబర్ 2012: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు మాతృమూర్తి భూదేవమ్మ బుధవారం తుదిశ్వాస విడిచారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో కొద్దిరోజులుగా హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. భూదేవమ్మ మృతి పట్ల వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సంతాపం తెలిపింది. కాగా ఈ రోజు ఉదయం వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ నిమ్స్కు వెళ్లి భూదేవమ్మను పరామర్శించారు.