వైయస్ఆర్ ఆశయ సాధనకు కృషి
15 Feb, 2017 14:55 IST
అనంతపురం: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనకు ఆయన కుమారుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో కృషి చేస్తామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నదీమ్ అహ్మద్ వ్యాఖ్యానించారు. మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఎన్నికైన నదీమ్ అహ్మద్‌ను బుధవారం అనంతపురంలో పలువురు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మైనారిటీల సంక్షేమ కోసం పాటుపడిన ఘనత ఒక్క వైయస్ఆర్‌కే దక్కుతుందన్నారు. ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కారని మండిపడ్డారు. మైనారిటీలపై టీడీపీ సర్కార్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. మైనారిటీల హక్కుల సాధనకు వైయస్ జగన్ నేతృత్వంలో పోరాటం చేస్తామని నదీమ్ తెలిపారు.