రోజా పిటిషన్ పై తీర్పు రేపటికి వాయిదా
16 Mar, 2016 14:12 IST
హైదరాబాద్ః వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్ కె రోజా పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. పూర్తి వాదనలు విన్న హైకోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. రోజా సస్పెన్షన్ కు సంబంధించి ఆమె తరపున న్యాయవాది ఇందిరా జైసింగ్ ఇవాళ కోర్టులో వాదించారు. 340(2) సెక్షన్ ప్రకారం ఏడాది పాటు రోజాను సస్పెండ్ చేసే అధికారం అసెంబ్లీకి లేదని ఇందిరా జైసింగ్ వాదనలు వినిపించారు.