వైయస్‌ జగన్‌ పాలనలో ఐఏఎస్‌గా పని చేయాలని ఉంది

25 Jul, 2018 12:13 IST
తూర్పు గోదావరి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో తాను ఓ ఐఏఎస్‌గా పని చేయాలని ఆశగా ఉందని కర్నూలు కు చెందిన దివ్యతేజ పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్ర 220వ రోజు బుధవారం దివ్యతేజ వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జగనన్నను కలవడం ఆనందంగా ఉందని చెప్పారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత నియోజకవర్గంలో సివిల్‌ సర్వేంట్‌గా పని చేయాలని ఆశగా ఉందన్నారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. యువతకు ఉపాధి లేక తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. రాజన్న రాజ్యంతోనే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలోనే సివిల్‌ సర్వెంట్‌గా పని చేయాలని ఉండేదని, దురదృష్టవశాత్తు మహానేత చనిపోవడంతో నా ఆశ నెరవేరలేదన్నారు. అయితే జననేత ముఖ్యమంత్రి అవుతారని ఇప్పుడు ఆశగా ఉందని, కచ్చితంగా ఐఏఎస్‌గా పని చేస్తానని చెప్పారు.