జంతర్‌మంతర్ వద్ద నేడు విజయమ్మ ధర్నా
28 Aug, 2013 10:20 IST
న్యూఢిల్లీ, 28 ఆగస్టు 2013:
రాష్ట్ర విభజన విషయంలో అన్ని ప్రాంతాలకూ సమన్యాయం చేయాలంటూ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు. ఈ ధర్నాలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మతో పాటు పార్టీ ఎం.పి., ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యులు పాల్గొంటారు. ఉదయం పది గంటలకు ధర్నా ప్రారంభం కానుంది.
అనేక చిక్కు సమస్యలకు పరిష్కారం చూపకుండా రాష్ట్రాన్ని విభజించడం సరికాదంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు మంగళవారంనాడు ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి, వినతిపత్రాలు అందజేశారు. సమన్యాయం చేయాలని విజ్ఞప్తి చేసిన వారు... చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని కోరారు.