రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా దశరథనాయుడు నియామకం
నల్లచెరువు: వైయస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నల్లచెరువుకు చెందిన దశరథనాయుడును నియమించినట్లు కదిరి నియోజకవర్గ వైయస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ పివీ సిద్ధారెడ్డి తెలిపారు.శనివారం డాక్టర్ సిద్ధారెడ్డి స్వగృహాంలో సమావేశం ఏర్పాటు చేసి దశరథనాయుడు పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేసి తనపై నమ్మకం ఉంచి పదవి ఇచ్చినందుకు డాక్టర్ పీవీ సిద్ధారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే మండలంలో పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు రమణారెడ్డి,అక్బర్,క్రిష్టప్ప,శ్రీనివాసులు,మాజీ ఎంపీటీసీ లక్ష్మీపతియాదవ్,నాయకులు నడింపల్లి శ్రీనివాసరెడ్డి,వెంకటరెడ్డి,రంగారెడ్డి,నాగేళ్లరమేష్‌నాయుడు,నాసునరసింహులు,కల్లిపల్లిశ్రీనివాసులు,షేక్షావలీ,హైదర్‌వలీ పాల్గొన్నారు.