వైయస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో కీలక నిర్ణయాలు
హైదరాబాద్) వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఇతర ఎంపీలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వర ప్రసాద్, బుట్టా రేణుక, మిథున్ రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. సోమవారం నుంచి మొదలవుతున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేశారు. నిస్సిగ్గుగా జరుగుతున్న ఫిరాయింపుల మీద చర్యలు తీసుకోవాలని, చట్ట సవరణ చేయటం ద్వారా అక్రమాలకు కళ్లెం వేసే విధంగా కేంద్రం పై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ప్రత్యేక హోదా మీద రాష్ట్రం తరపున పోరాడనున్నారు. పోలవరం వంటి పెండింగ్ ప్రాజెక్టుల కోసం పార్టీ వంతు ప్రయత్నాలు చేయాలని భావిస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న అరాచకాలు, ప్రజల్లో నెలకొన్న వ్యతిరేక భావనలు గమనిస్తూ రాష్ట్రానికి కావలసిన అంశాల మీద ప్రయత్నాలు చేయాలని నిర్ణయించారు.