నెట్టింట అలరిస్తున్న జననేత ఫోటోస్
25 Jun, 2016 12:39 IST

లండన్ః ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ విదేశీ పర్యటన ఫోటోలు నెట్ లో హల్చల్ చేస్తున్నాయి. ప్రజానాయకుడు వైయస్ జగన్ లండన్ లో గేమ్స్ ఆడుతున్న ఫోటోలు ప్రతి ఒక్కరినీ అమితంగా ఆకట్టుకుంటున్నాయి. మొన్న గోల్ఫ్ , నిన్న చెస్, నేడు ఫుట్ బాల్ ఆడుతూ ఉన్న వైయస్ జగన్ ఫోటోలు సోషల్ మీడియాలోఅందరినీ అలరిస్తున్నాయి.



కుటుంబసభ్యులతో కలిసి వైయస్ జగన్ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లారు. ఈనేపథ్యంలో వివిధ సందర్భాల్లో వైయస్ జగన్ అక్కడ క్రీడలు ఆడుతున్న ఫోటోలు నెటిజన్ల చేతికి చిక్కాయి. ఇంకేముంది తమ అభిమాన నేతను చూసేందుకు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో తలమునకలైపోయారు. లైక్ లు, షేర్ లతో నెట్టింట సందడి చేస్తున్నారు.
