కాపు ఉద్యమాన్ని అణచివేసే కుట్ర
31 Jan, 2017 16:25 IST
విజయవాడ: కాపు ఉద్యమాన్ని చంద్రబాబు అణచివేసేందుకు కుట్ర పన్నిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. హామీలు అమలు చేయకపోతే బాబుకు ప్రజలే గుణపాఠం చెబుతారని అంబటి హెచ్చరించారు.