జర్నలిస్టు సాయిబాబా కుటుంబానికి పరామర్శ
తూర్పుగోదావరి: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన గంగవరం మండలం జిల్లావాణి జర్నలిస్టు గొల్లపల్లి సాయిబాబా కుటుంబాన్ని వైయస్ఆర్‌సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, రంపచోడవరం కోఆర్డినేటర్ అనంత ఉదయభాస్కర్(బాబు) గురువారం పరామర్శించారు. గురువారం కుసుమరాయి గ్రామంలో సాయిబాబా వర్థంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పలువురు ప్రముకులు, పాత్రికేయ మిత్రులు వర్థంతి కార్యక్రమంలో పాల్గొని సాయిబాబాకు శ్రద్ధాంజలి ఘటించారు. ఉదయం వైఎస్సార్‌సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంతబాబు, వైఎస్సార్‌సీపీ నాయకులు సాయిబాబా కుటుంబాన్ని పరామర్శించారు. సాయిబాబా పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు గొల్లపల్లి బేబిరాణికి మరిది. మండల కన్వీనర్ ఎ.అప్పలరాజు, జిల్లా నాయకులు ఏడుకొండలు, నక్కా మోహన్, వేణుం అప్పారావు, ముప్పనశెట్టి శ్రీనువాస్, కుంజం గంగాదేవి, గోడి వీర్రాజు, స్థానిక నాయకులు చెడెం వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లుదొర, ఎన్.నాగభూషణం, ప్రసాద్, తదితరులు పరామర్శించినవారిలో ఉన్నారు. అలాగే వర్థంతి కార్యక్రమంలో గంగవరం ప్రెస్‌క్లబ్ అద్యక్షుడు వి.శేషాచార్యులు, స్థానిక విలేకర్లు పాల్గొన్నారు.