చిన్నారుల మధ్య షర్మిల
14 Nov, 2012 11:20 IST
ఆదోని
14 నవంబర్ 2012 : బాలల దినోత్సవం సందర్భంగా షర్మిల బుధవారం ఆదోనిలో చిన్నారులతో గడిపారు. ఆర్ట్స్ కళాశాల నుండి 28వ రోజు పాదయాత్రను మొదలుపెడుతూ స్థానిక మల్లికార్జున విద్యాలయంలో ఆమె పిల్లలతో కేక్ కట్ చేయించారు. మురిపెంగా ముద్దాడి వారికి ఆప్యాయంగా కేక్ తినిపించారు. చిన్నా రులకు షేక్‌హ్యాడ్ ఇస్తూ వారి మధ్య కాసేపు సరదాగా గడిపి ముందుకు సాగారు.