'చరిత్రలో నిలిచిపోయే షర్మిల పాదయాత్ర'
21 Nov, 2012 14:31 IST
కర్నూలు, 21 నవంబర్ 2012: మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత మన రాష్ట్రంలో ప్రాజెక్టుల గురించి పట్టించుకున్న నాథుడే లేదని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. షర్మిల పాదయాత్ర నేడు కర్నూలు నగరంలో కొనసాగుతోంది. పాదయాత్రలో పాల్గొన్న గౌరు వెంకటరెడ్డి మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నారు.