రెండేళ్ల బాబు పాలన ప్రజా కంటక పాలన..ఎమ్మెల్యే రోజా
7 Jun, 2016 13:41 IST
హైదరాబాద్) చంద్రబాబు నాయుడి రెండేళ్ల పాలన ను ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజా కంటక పాలన అని వైయస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అభివర్ణించారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, లోకేష్ కలిసికట్టుగా రాష్ట్రాన్ని దోచుకొంటున్నారని ఆమె మండిపడ్డారు. రెండేళ్ల పాలనలో మహిళలకు ఏమైనా చేశారా అంటే రిషితేశ్వరి ఆత్మహత్య, ఎమ్మార్మో వనజాక్షి మీద దాడి, లావణ్య హత్య వంటి ఘటనలు మాత్రమే మిగిలాయని ఆమె అన్నారు. కాల్ మనీ సెక్సు రాకెట్ ఘటనలో నిందితుల్ని రక్షిస్తూ మహిళల ఉసురు పోసుకొంటున్నారని మండిపడ్డారు. మద్యం తాగండి, పేకాట ఆడండి అంటూ ప్రజల్ని రెచ్చ కొడుతున్న ఘనత చంద్రబాబుదే అని రోజా అన్నారు. ఇటువంటి నాయకుల్ని చీపుర్లతో కొట్టి, పేడ నీళ్లు కొడితే తప్పేముందని మండిపడ్డారు.