రాజ్యాంగాన్ని కించపరుస్తున్న చంద్రబాబు
13 Apr, 2017 15:54 IST
విజయవాడః అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని చంద్రబాబు నాయకుడు కించపరుస్తున్నాడని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. విజయవాడ జింఖానా గ్రౌండ్ సమీపంలోని కందుకూరి కళ్యాణమండపంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఉమ్మారెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యానికి అంబేద్కర్ అత్యంత విశిష్టతను ఆపాదిస్తే.. నేడు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. రాజ్యాంగాన్ని పరిరక్షించే ఉన్నత స్థానంలో ఉన్న వారు వ్యవహరిస్తున్న తీరు భాధకరంగా ఉందని అన్నారు. ఒక పార్టీ లో గెలిచిన వారిని మరో పార్టీలో చేర్పించుకోవడం రాజ్యాంగబద్దమా..? ఆనాడు తలసాని పార్టీ మారితే విమర్శలు చేసిన చంద్రబాబు... ఇప్పుడు తాను చేస్తున్నదేమిటి అని ప్రశ్నించారు.