పీక్కొని తింటున్న చంద్రబాబు

9 Jul, 2016 16:34 IST

() బయట పెట్టుకొన్న చంద్రబాబు బుద్ధి

() ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు

() విరుచుకు పడుతున్న పచ్చ గూండాలు

చిత్తూరు) చంద్రబాబు చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపుతున్న ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద చంద్రబాబు కక్ష పెట్టుకొన్నారు. పోలీసుల్ని అడ్డుపెట్టుకొని వేధించేందుకు అడ్డమైన దారులు తొక్కుతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో చురుకైన ప్రతిపక్ష ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ని పాత కేసులు తిరగతోడి మరీ అరెస్టులు చేయిస్తున్నారు.

 

ప్రతిపక్షాలపై అక్కసు

ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న సామెత చంద్రబాబుకి ఎప్పుడు సరిపడదు. ఎందుకంటే ఆయన సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో టీడీపీ కి ఎప్పుడూ సానుకూలత లేదు. పైగా ఆయన సొంత నియోజక వర్గం చంద్రగిరి లో ఎప్నుడూ ప్రత్యర్థులదే గెలుపు. అక్కడ వైయస్సార్సీపీ తరపున గెలుపొందిన డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రజల తరపున నిరంతరాయంగా పోరాడుతున్నారు. దీంతో ఆయన్ని నేరుగా ఎదుర్కోలేని టీడీపీ నాయకులు ప్రతిపక్ష కార్యకర్తల్ని వేధించేందుకు పోలీసుల్ని , రెవిన్యూ యంత్రాంగాన్ని మోహరిస్తున్నారు. అన్యాయంగా ఒక వైయస్సార్సీపీ కార్యకర్త ఇంటిని కూల్చేసేందుకు టీడీపీ నాయకుల డైరక్షన్ లో అధికారులు ప్రయత్నించినప్పుడు చెవిరెడ్డి అడ్డుకొన్నారు. దీంతో చంద్రబాబు మార్కు కుట్రలకు తెర లేచింది.

 

వరుసగా అరెస్టులు

విధులకు అడ్డం తగులుతున్నారంటూ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎమ్మార్ పల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఎటువంటి చట్ట ప్రకారమైన మార్గాలు లేనందున ఆయన్ని విడిచిపెట్టారు. దీంతో మనస్తాపానికి లోనైన శాసనసభ్యుడు చెవిరెడ్డి ప్రజల తరుపున స్థానిక ఆర్డీవో కార్యాలయం దగ్గర ఆయన ధర్నాకు దిగారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపారు. ఈ లోగా పాత కేసు ని తిరగతోడి చంద్రబాబు గ్యాంగ్ పోలీసుల్ని ఉసికొల్పింది. ఖాకీ బట్టలు వేసుకొన్నామని మరిచిపోయిన చిత్తూరు జిల్లా పోలీసు యంత్రాంగం .. పచ్చ చొక్కా తొడుక్కోని టీడీపీ యంత్రాంగంగా మారిపోయింది. ఎప్పుడో 2013 లో ఎన్నికల్ కోడ్ ఉల్లంఘించారన్న కేసును వెదకి పట్టుకొని పరిగెత్తుకొని వచ్చారు. వెంటనే చెవిరెడ్డిని ఉన్నఫళాన అరెస్టు చేశారు. అరెస్టు అనేకంటే ఈడ్చుకొని పోయారంటే మేలు అనే రీతిలో వ్యవహరించారు. ఒక ఎమ్మెల్యేకు ఇచ్చే గౌరవం దేవుడెరుగు కనీసం ఒక సాధారణ మనిషికి ఇచ్చే గౌరవం లేకుండా పోలీసులు చంద్రబాబు గ్యాంగ్ కు ఊడిగం చేస్తున్న రీతిలో ప్రవర్తించారన్న రీతిలో వ్యవహరించారు. తర్వాత ఆయన్ని మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. తర్వాత చిత్తూరు సబ్ జైలుకి తరలించారు. అనంతరం ఆయన న్యాయవాదులు కోర్టుని ఆశ్రయించి బెయిల్ తీసుకొన్నారు. అయితే సమయం దాటిపోయిందంటూ బెయిల్ మీద ఆయన్ని విడుదల చేసేందుకు ఖాకీలు మరోసారి అడ్డుకొన్నారు. దీంతో రాత్రంతా ఎమ్మెల్యే ఖాకీల గుప్పిట్లో ఉండిపోయారు.

 

మరోసారి హైడ్రామా

చిత్తూరు సబ్ జైలు వద్ద శనివారం హైడ్రామా చోటుచేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. వడమాలపేట పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన కేసులో బెయిల్ పై బయటకు వచ్చారు. అయితే తమ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎమ్మెల్యే చెవిరెడ్డిపై మరో కేసు ఉందంటూ ఆయనను ఎంఆర్ పల్లి పోలీసులు అరెస్ట్ చేసేందుకు వచ్చారు. కేవలం సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర వాచ్ మన్ విదులకు ఆటంకం కలిగించారంటూ కేసులు నమోదు చేశారు. ఒకటి, రెండు కాదు ఏకంగా ఏడు రకాల సెక్షన్ల మీద కేసులు బుక్ చేశారు. దీని మీద అక్కడ ఉన్న కార్యకర్తలు నిరసన తెలిపినా పట్టించుకోలేదు.  అయితే ఎంఆర్ పల్లి పోలీసులు మాత్రం ఆయనను బలవంతంగా అక్కడ నుంచి లాక్కెళ్లారు. స కేవలం టీడీపీ నేతల మెప్పు పొందటమే లక్ష్యంగా మరోసారి పోలీసులు చెలరేగిపోయి, ప్రజల ద్రష్టిలో మరింతగా దిగజారిపోయి ప్రవర్తించారు.

 

 

వైయస్సార్సీపీ నాయకులు బాసట

చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేయడం అధికారపార్టీ రాజకీయ కుట్ర అని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, నగరి ఎమ్మెల్యే ఆర్కేరోజా విమర్శించారు. అంతకు ముందు ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే రోజా, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డిని పరామర్శించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎప్పుడూ ప్రజాసమస్యలపై పోరాడే  చెవిరెడ్డిని అణచివేయాలనే కుట్రతో తప్పడు కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అధికార పార్టీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. పోలీసులు కూడా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే అని కూడా చూడకుండా అర్ధరాత్రి లాక్కొచ్చి స్టేషన్‌లో వేయడం ప్రజాస్వామ్యమా అని విమర్శించారు.