ఏపీ ప్రజలకు కరెంట్ షాక్..!

19 Sep, 2015 18:33 IST
ప్రజలపై విద్యుత్ వడ్డనకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. విద్యుత్ ఛార్జీల పెంపునకు డిస్కంలు సన్నద్ధమయ్యాయి. ఛార్జీల పెంపు నిర్ణయాన్నివిద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించాయి. రూ.7200 కోట్ల మేర ఛార్జీలు పెంచేందుకు డిస్కంలు ప్రతిపాదనలు అందజేశాయి. డిస్కంల ప్రతిపాదనలపై ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించింది. చంద్రబాబు సర్కార్ పుణ్యమాని ఇప్పటికే నిత్యవసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీనికి తోడు పెరగనున్న విద్యుత్ ఛార్జీలు వినియోగదారులపై పెనుభారాన్ని చూపనున్నాయి.