రైతుల గొంతు కోస్తున్న చంద్రబాబు

5 Jul, 2016 13:27 IST

హైదరాబాద్) పట్టాదార్ పాస్ బుక్ ల రద్దు అంటే రైతుల గొంతు కోయటమే అని వైయస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షులు ఎమ్ వీ ఎస్ నాగిరెడ్డి అభిప్రాయ పడ్డారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులతో కానీ, రైతు సంఘాలతో కానీ ఏమాత్రం చర్చించకుండా నిర్ణయం తీసుకొన్నారని ఆయన మండిపడ్డారు. 13 జిల్లాల్లోని ఏ గ్రామంలోనూ రికార్డులు సరిగా లేవని, టెక్నాలజీని అందుకునే పరిస్థితుల్లో రైతులు లేరని స్పష్టం చేశారు.  గ్రామీణప్రాంతాల్లో టీడీపీ నేతలు ఇతరుల భూముల్ని కొట్టేయడానికే ఈకార్యక్రమం తీసుకున్నారని మండిపడ్డారు.

భూమిని కన్నతల్లికంటే ఎక్కువగా చూసుకుంటున్న భూమిని గోల్ మాల్ చేసే పరిస్థితి నెలకొందని చెప్పారు.   వెంటనే పాస్ బుక్ ల రద్దు కోసం ఇచ్చిన జీవో 271 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.