బాబు రైతులను నట్టేట ముంచాడు

16 May, 2017 12:04 IST
అమరావతిః పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని వైయస్సార్సీపీ వ్యాఖ్యానించింది. చంద్రబాబు రైతులను నట్టేట ముంచడంతో, రైతులంతా రోడ్డున పడి ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొందని వైయస్సార్సీపీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. త రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి పంటలను వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమకు రైతు సమస్యలే ముఖ్యమని, రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.