అన్యాయాలపై పోరాడితే ఉన్మాది అంటారా?: బత్తుల
14 Aug, 2016 15:00 IST
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేవన్నీ మోసాలు అన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రజల తరఫున పోరాడుతున్న వాళ్లను ఉన్మాదులతో పోలుస్తూ నీచరాజకీయాలకు తెరతీస్తున్నారని మండిపడ్డారు. సీనియర్ జర్నలిస్టు ఏబీకే ప్రసాద్ ను చంద్రబాబు ఉన్మాదిగా పేర్కొనడాన్ని తప్పుబట్టారు. ఏబీకే లాంటి గొప్ప జర్నలిస్టును ఉన్మాదిగా చిత్రీకరించడం దారుణమన్నారు. ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై కోర్టుకు వెళితే ఉన్మాదిగా ముద్ర వేస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ఏ స్థాయికి దిగజారాడండే పట్టిసీమకు గండిపడితే అది ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేయించారని అకారణంగా అభాండాలు వేసే స్థాయికి దిగజారిపోయాడాని మండిపడ్డారు.