చంద్రబాబు పాదయాత్ర నాటకం: బాలినేని
23 Oct, 2012 16:58 IST
ఒంగోలు:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వైయస్‌ఆర్ సీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. చలన చిత్ర దర్శకుల డైరెక్షన్‌లో చంద్రబాబు చేసే పాదయాత్ర ఓ నాటకమని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైనందువల్లే చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడం లేదని బాలినేని ఆరోపించాచారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు కలిసి పోటీ చేసినా ఆశ్చర్యపడనవసరం లేదన్నారు. కుమ్మక్కు రాజకీయాలకు ప్రజలే బుద్ధిచెబుతారని ఆయన మండిపడ్డారు.