చంద్రబాబుది దివాళా యాత్ర: రెహ్మాన్
4 Oct, 2012 01:17 IST
హైదరాబాద్, 4 అక్టోబర్ 2012: చంద్రబాబు చేస్తున్నది దివాళా యాత్ర అని, కిరణ్‌కుమార్‌రెడ్డి దమ్ము లేని ముఖ్యమంత్రి అని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందపెట్టే సమయం ఆసన్నమైందన్నారు. మహానేత వైయస్ మరణించిన తరువాత రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని, జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే అవి సమసిపోతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్ సీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి విడుదలను ఆకాంక్షిస్తూ పార్టీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో పలువురు మైనార్టీ నేతలు చంచల్‌గూడ జైలు నుంచి ఇడుపులపాయ (వైయస్‌ఆర్ ఘాట్)కు బుధవారం యాత్ర ప్రారంభించారు. పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ అబ్దుల్ రెహ్మాన్, మైనార్టీ రాష్ట్ర నాయకుడు అర్షద్ ఈ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా రెహ్మాన్ మాట్లాడుతూ, రాష్ర్టంలో ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కాంగ్రెస్, టీడీపీ కలిసి వైయస్ కుటుంబాన్ని వేధిస్తున్నాయన్నారు.
కాగా, జైలు వద్దకు ర్యాలీగా వస్తున్న వైయస్ఆర్ సీపీ నాయకులను పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేసి అడ్డుకున్నారు. దీంతో చంచల్‌గూడ చౌరస్తా నుంచి నేతలు యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాబర్‌ఖాన్, సూరజ్ యెస్దానీ, అజ్జు, అజీమ్, షామీర్, మక్సూద్, అబ్బాస్ అలీ, అక్రమ్, అల్తాఫ్, సుబేర్ తదితరులు పాల్గొన్నారు.