వైయస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చలివేంద్రాల ఏర్పాటు
పలమనేరు: పట్టణంలో ప్రజల సౌకర్యార్థం వైయస్సార్‌సీపీ కోఆర్డినేటర్ రాకేష్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం పలు చోట్ల చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. స్థానిక అంబేద్కర్‌విగ్రహం వద్ద కోఆర్డినేటర్ సీవీ కుమార్ చలివేంద్రాన్ని ప్రారంభించారు. సందర్భంగా మజ్జిగను పంపిణీ చేశారు. పట్టణంలోని జిలానీ సర్కిల్, మార్కెట్‌కమిటీ, రెక్కమాను తదితర ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసినట్టు నాయకులు చెంగారెడ్డి తెలిపారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మురళీకృష్ణ, పట్టణ కన్వీనర్‌మండీ సుధా,జిల్లా ఎస్సీసెల్‌అధ్యక్షులు శ్యామ్‌సుందర్‌రాజు, కౌన్సిలర్‌కోదండరామయ్య, జావీద్, సోము తదితరులు పాల్గొన్నారు. మరోవైపు మండలంలోని సముద్రపల్లి పంచాయతీ పరాగ్‌డైరీ వద్ద సర్పంచ్‌విజయ్‌ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఇందులో ఎంపీడీవో హుర్మత్, ఈవోఆర్డీ గిరిధర్, పంచాయతీ కార్యరద్శి ఓబన్న తదితరులు పాల్గొన్నారు.