చెన్నై వెళ్లేందుకు వైయస్ జగన్‌కు అనుమతి
26 Nov, 2013 14:47 IST
హైదరాబాద్ :
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి చెన్నై వెళ్లేందుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అనుమతినిచ్చింది. ఈ మేరకు సీబీఐ కోర్టు ప్రధాన న్యాయాధికారి ఎన్.బాలయోగి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మద్దతు కోసం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలిసేందుకు అనుమతినివ్వాలని కోరుతూ శ్రీ జగన్మోహన్‌రెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం బాలయోగి విచారించారు. ఈ నెల 26 నుంచి 29వ తేదీ మధ్య ఏదో ఒక రోజు చెన్నై వెళ్లవచ్చునని, జయలలితతో అపాయింట్‌మెంట్ ఖరారు అయిన తరువాత ఆ వివరాలన్నింటినీ సీబీఐకి తెలియచేయాలని బాలయోగి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.