మేడికొండపై హత్యాయత్నం ఘటనలో కేసు నమోదు..
15 Nov, 2018 17:34 IST
ఎఫ్‌ఐఆర్‌లో ఏ–2గా చింతమనేని ప్రభాకర్ పేరు..
పశ్చిమగోదావరిః వైయస్‌ఆర్‌సీపీ నేత మేడికొండ కృష్ణపై హత్యాయత్నం ఘటనలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పెదవేగి పోలీసులు. ఏ–1గా చింతమనేని ప్రధాన అనుచరుడు గద్దె కిశోర్,ఏ–2గా చింతమనేని ప్రభాకర్, ఏ–3గా చింతమనేని గన్‌మెన్ల పేర్లు నమోదు చేశారు. దాడి,కిడ్నాప్ చేసినట్లుగా నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.