విజయమ్మ కాన్వాయ్‌పై దాడి చేసిన వారిపై కేసు
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా కాన్వాయ్‌పై దాడికి పాల్పడిన వారి మీద నేలకొండపల్లి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. భారీ వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు శ్రీమతి విజయమ్మ అక్టోబర్ 31న ఖమ్మం జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా నేలకొండపల్లి మీదుగా నల్లగొండ జిల్లాలోకి శ్రీమతి విజయమ్మ వెళుతుండగా ఖమ్మం జిల్లా సరిహద్దు గ్రామం పైనంపల్లిలో కందుల మధు మరికొందరు కాన్వాయ్‌ను అడ్డగించి చెప్పులు, కర్రలతో దాడి చేశారు. శ్రీమతి విజయమ్మను అవమానించేలా వ్యవహరించారు.
తమ పార్టీ నేతల వ్యక్తిగత స్వేచ్ఛను, కార్యకర్తల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారంటూ దాడికి పాల్పడిన వారిపై వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు జిల్లపల్లి సైదులు, నకిరికంటి సూర్యనారాయణ, జెర్రిపోతుల అంజిని నేలకొండపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనితో విచారణ చేపట్టి నల్లగొండ జిల్లా కోదాడకు చెందిన కందుల మధు, మరో ఐదుగురిపై 341, 352, 355 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై పి.సత్యనారాయణరెడ్డి తెలిపారు.