సమాధానం చెప్పలేక ప్రభుత్వం పారిపోతుంది

16 Mar, 2017 11:49 IST
ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు
విప్‌ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి
ఏపీ అసెంబ్లీ:  ప్రజలకు సమాధానం చెప్పలేక ఈ ప్రభుత్వం పారిపోతుందని, చట్టసభలో ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విప్‌ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చేనేత కార్మికులను ప్రతి ఏటా రూ.వెయ్యి కోట్లు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు మాట తప్పారని ఫైర్‌ అయ్యారు. ప్రతిపక్షం  ప్రశ్నిస్తే మాకు సమాధానం చెప్పడం లేదని ధ్వజమెత్తారు. చేనేత కార్మికుల సమస్యలపై మాట్లాడేందుకు వైయస్‌ జగన్‌కు మౌక్‌ ఇవ్వాలని కోరితే సభను వాయిదా వేశారని ఆరోపించారు. హౌసింగ్‌ విషయంలో కూడా ప్రభుత్వం అన్ని అబద్ధాలే చెబుతుందన్నారు. ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని, పేదవాళ్లకు ఇల్లు కట్టించాలంటే వైయస్‌రాజశేఖరరెడ్డి లాంటి మనసున్న నాయకుడు అధికారంలోకి రావాలన్నారు. హైదరాబాద్‌లో చంద్రబాబు ఇల్లు కట్టుకుంటున్నారని, చిన్నబాబుకు ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చారని ఎద్దేవా చేశారు. పేద వాళ్లకు మాత్రం ఇల్లు కట్టించడం లేదని పిన్నెళ్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లు చేస్తున్న తప్పులను ఎత్తి చూపడంతో ఒక్క సప్లిమెంటరీతోనే సభను ముగించాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రతి విషయంపై సభలో చర్చ జరగాలని మేం కోరుతుంటే టీడీపీ నేతలు పారిపోతున్నారని పిన్నెళ్లి పేర్కొన్నారు.

 చదువు సంధ్యాలేని నాయాళ్లు
ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
వెలగపూడి: చదువు, సంధ్యలేని నాయాళ్లు అసెంబ్లీకి వచ్చి పోలవరం ప్రాజెక్టుపై సబ్జెక్ట్‌ లేకుండా మాట్లాడుతున్నారని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్టుపై ప్రతిపక్షనేత లెక్కలతో సహా చెబుతుంటే వినే ఓపికలేక తాడుబొంగరం లేకుండా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రాజెక్టులను టీడీపీ సర్కార్‌ ఆదాయ వనరుల కింద మార్చుకుంటుందని ధ్వజమెత్తారు. కాంట్రాక్టర్‌లుగా పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో ఆదాయం కొట్టేసిన చంద్రబాబు, లోకేష్‌ తరువాత రాజధాని పేరుతో రియలెస్టేట్‌ వ్యాపారం చేసి కోట్లు సంపాదించారని ఆరోపించారు. రియలెస్టేట్‌ వ్యాపారం అయిపోగానే పోలవరం ప్రాజెక్టపై పడి అవినీతికి పాల్పడుతున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం నుంచి ఆదాయం కోసం తీసుకున్నారు కానీ అభివృద్ధి కోసం కాదని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది వైయస్‌ఆర్‌.. రూ. 5 వేల కోట్లకుపైగా ఖర్చు చేశారని గుర్తు చేశారు. కాబట్టి ఆ ప్రాజెక్టుపై పూర్తి హక్కు మాకేవుందని ప్రభుత్వానికి సూచించారు. వైయస్‌ఆర్‌ పూర్తి చేసిన కాలువల్లో పైపులు వేసి నదులను అనుసంధానం చేశామని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ఇన్‌కం సోర్స్‌లా ప్రాజెక్టు అంచెనాలను రూ. 16 వేల కోట్ల నుంచి 40 వేల కోట్లకు పెంచారని దుయ్యబట్టారు. దయచేసి ప్రభుత్వం ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ చెప్పే సలహాలు, సూచనలు తీసుకొని ప్రజలకు మేలు చేసే విధంగా పాలన చేయాలని కోరారు. నియంతపోకడను మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. సభలో ఎవరేమి మాట్లాడుతున్నారనేది ప్రజలు గమనిస్తున్నారని సమయం వచ్చినప్పుడు చంద్రబాబు చెంప చెల్లుమనిపించేలా ప్రజలు తీర్పు ఇస్తారని హెచ్చరించారు.