విద్యార్థులకు బుర్రా మధుసూదన్ పరామర్శ
2 Mar, 2017 12:08 IST
ప్రకాశం: జిల్లాలోని పీసీ పల్లె మండలం పెద్ద అలవలపాడు వద్ద బస్సు బోల్తా పడిన ఘటనలో గాయపడిన విద్యార్థులను వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్‌యాదవ్ పరామర్శించారు. కరేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు విహారయాత్రకు వెళ్లి తిరగి వస్తుండగా బస్సు బోల్తా పడిన ఘటనలో 15 మంది విద్యార్థులు గాయపడగా, వారికి కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు నిర్వహిస్తున్నారు. బాధిత విద్యార్థులను మధు సూదన్ యాదవ్ పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు.