బిల్డర్‌ సత్యనారాయణ వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

24 May, 2018 15:16 IST

పశ్చిమ గోదావరి:  విశాఖకు చెందిన ఎంవీబీ బిల్డర్స్‌ అధినేత సత్యనారాయణ వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. గురువారం ఆయన పశ్చిమ గోదావరి జిలాలో వైయస్‌ జగన్‌ను కలిశారు. సత్యనారాయణకు వైయస్‌జగన్‌ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. సత్యనారాయణ మాట్లాడుతూ..విశాఖలో వైయస్‌ఆర్‌సీపీ గెలుపునకు తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. వైయస్‌ జగన్‌ లాంటి ప్రజాదరణ కలిగిన నాయకుడు ఎవరూ లేరని స్పష్టం చేశారు. వైయస్‌ జగన్‌ నాయకత్వంలో పనిచేసేందుకు పార్టీలో చేరానని ఆయన తెలిపారు.