బొబ్బిలి రాజులు బొబ్బిలి పరువు తీశారు..
16 Oct, 2018 11:08 IST
విజయనగరంః బొబ్బిలి రాజులపై ఎంతో నమ్మకం పెట్టుకున్న వైయస్ జగన్మోహన్ రెడ్డికి వారు తీరని ద్రోహం చేశారని బొబ్బిలి నియోజకవర్గం వైయస్ఆర్సీపీ సమన్వయకర్త వెంకట చిన్న అప్పలనాయుడు మండిపడ్డారు. వారి కుటుంబానికి మూడు జిల్లాల బాధ్యతలు అప్పగించారన్నారు. సుజయ్ కృష్ణ రంగారావు అన్నదమ్ములకు ఎంపీ,ఎమ్మెల్యేలు సీట్లు ఇచ్చి గెలిపించిన పార్టీని కాదని టీడీపీలోకి వెళ్ళి బొబ్బిలి ప్రజల పరువు తీశారన్నారు. బొబ్బిలి నియోజకవర్గం దుర్భిక్ష ప్రాంతమని, సరైన ఇరిగేషన్ లేక రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ ప్రాంతం నుంచి టీడీపీకి చెందిన మంత్రులు వున్నా ప్రజలను పట్టించుకోలేదన్నారు. రోడ్డు సౌకర్యాలు కూడా సరిగ్గా లేవన్నారు. నియోజకవర్గంలో అవినీతి ఇష్టారాజ్యంగా పెరిగిపోయిందన్నారు. టీడీపీ నేతలు భూములను కబ్జా చేస్తున్నారన్నారు. ఇక్కడ సమస్యలన్నీ వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువస్తామన్నారు. బుధవారం నాడు బొబ్బిలిలోని వైయస్ జగన్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.