నల్ల బ్యాడ్జిలతో పాదయాత్ర
30 Apr, 2018 09:22 IST
కృష్ణా జిల్లా: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో ఇవాళ అధినేతతో పాటు ప్రతి ఒక్కరూ నల్ల బ్యాడ్జిలు ధరించారు. పార్లమెంట్ సాక్షిగా, 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా బీజేపీ, టీడీïపీలు వంచనకు గురిచేయడాన్ని నిరసిస్తూ విశాఖలో ‘వంచన వ్యతిరేక దీక్ష’ను తలపెట్టారు. ఈ దీక్షకు మద్దతుగా వైయస్ జగన్ పాదయాత్రలో నల్లబ్యాడ్జి ధరించి నిరసన తెలిపారు. పాదయాత్రలో పాల్గొంటున్న పార్టీ శ్రేణులు నల్ల దుస్తులు ధరించారు. అలాగే ప్రత్యేక హోదాఆంధ్రుల హక్కు అంటూ దారి పొడవునా నినదిస్తున్నారు.
వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు పామర్రు ప్రజల నుంచి ఆపూర్వ ఆదరణ లభించింది. రాజన్న బిడ్డ చూడటానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా నిన్న పామర్రులో నిర్వహించిన బహిరంగ సభలో ప్రతిపక్ష నేత ప్రభుత్వ తీరును ఎండగట్టారు. చంద్రబాబు హయాంలో జరుగుతన్న దోపిడీని పామర్రు ప్రజల సాక్షిగా నిలదీశారు. సోమవారం ఉదయం పామర్రు శివారు నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. ఇవాళ జుజ్హువరం, నిమ్మకూరు, నిమ్మకూరు క్రాస్ మీదుగా మద్దిపట్నం, నిడుమోలు, తారకటూరు, తుమ్మలపాలెం క్రాస్ మీదుగా పర్ణశాల వరకు సాగుతుంది.