బి.కొత్తపల్లి సభకు చేరుకున్న విజయమ్మ
16 Dec, 2012 15:14 IST
బి.కొత్తపల్లి (చిత్తూరు జిల్లా), 16 డిసెంబర్ 2012: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ బి.కొత్తపల్లి బహిరంగ సభా వేదికకు చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆమె సభా వేదిక మీదకు చేరుకున్నారు. వేదిక మీదకు రాగానే విజయమ్మ అక్కడ ఏర్పాటు చేసిన దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. సభకు భారీ ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, జిల్లా నలుమూలల నుంచి ప్రజలు హాజరయ్యారు. సభా ప్రాంగణంలో జై జగన్ నినాదాలు మిన్నుముట్టాయి.
టిడిపి రెబల్ ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, తదితరులకు శ్రీమతి విజయమ్మ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.