విభజన పాపం టీడీపీదే: జోగి రమేష్
8 Aug, 2013 14:13 IST
విజయవాడ 07 ఆగస్టు 2013:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడానికి ముమ్యాటికీ టీడీపీనే కారణమని వైయస్ఆర్ కాంగ్రెస్ నేత జోగి రమేష్ స్పష్టంచేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు చీడపురుగులని ఆయన మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలు పొలిట్‌బ్యూరోలో అనుకూలంగా తీర్మానం చేశారన్నారు. ఆ లేఖ ఇచ్చినపుడు టీడీపీ నేతలు నిద్రపోయారా అని ఆయన ప్రశ్నించారు. రాజీనామాలు చేశామంటున్న కాంగ్రెస్ నేతలు అధికారాన్ని వాడుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. రాజీనామాలు ఆమోదించుకుని ఉద్యమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.