ప్రజా ప్రస్థానం ఒక చరిత్ర

9 Apr, 2018 16:04 IST
తెలుగు జాతికి పట్టిన శని అంతంపై మహానేత దండయాత్ర
దేశ రాజకీయాల్లో పెనుదుమారం లేపిన రాజశేఖరుడి జైత్రయాత్ర
చంద్రబాబు పాలనను పాతాళానికి అణగదొక్కిన విజయయాత్ర
ప్రజల కష్టాలను కడతేర్చేందుకే ఆనాడు మహానేత ప్రజాప్రస్థాన యాత్ర
ప్రతి గుండెలో నమ్మకాన్ని కలిగిస్తూ.. ప్రతి హృదయాన్ని నిమురుతూ..
ప్రజల అభిమానం చురగొన్న మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి
వైయస్‌ఆర్‌ మాట మంత్రమైంది. ఆయన అడుగు ఆదర్శమైంది
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగించారు
ఆయన మరణాన్ని తట్టుకోలేక గోదావరి ఉప్పొంగింది.. 670 గుండెలు ఆగాయి
తండ్రి ఆశయాలను పునికిపుచ్చుకొని వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్పయాత్ర
వైయస్‌ జగన్‌ మళ్లీ రాకాసి, రాక్షస పాలన శిరసు పాదయాత్రతో ఖండిస్తాడు
తిరుపతి: 15 ఏళ్ల క్రితం దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చేసిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఒక చరిత్ర అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. నాయకుడు ఉండాల్సింది రాజధానుల్లో కాదు.. ఏసీ గదుల్లో కాదు.. ప్రజలమధ్యలో ఉండాలి. ప్రజలు పడుతున్న దీనావస్థలని చూడాలనే లక్షణాలను పునికి పుచ్చుకున్న వైయస్‌ రాజశేఖరరెడ్డి తొమ్మది సంవత్సరాలుగా తెలుగు జాతికి పట్టిన శని అంతానికి పోరాట రూపంగా పాదయాత్ర చేశారన్నారు. పాదయాత్ర ఒక చరిత్ర.. పాదయాత్ర చంద్రబాబు పాలనపై దండయాత్ర, జైత్రయాత్రగా మారిందన్నారు. ప్రజా ప్రస్థానంకు 15 సంవత్సరాల సందర్భంగా తిరుపతిలో భూమన కరుణాకర్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారో.. ఆయన మాటల్లోనే.. 
ఏ ఒక్క వర్గానికి మేలు చేయకుండా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతూ.. చంద్రబాబు పాలించిన కాలమంతా కరువు కాటకాలతో రాష్ట్రం అల్లాడుతుంటే.. ఇతర దేశాల అధ్యక్షులు, పారిశ్రామిక వేత్తలను పిలిపించుకొని పొగడ్తలతో ప్రసార మాధ్యమాల్లో నింపి ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చని చంద్రబాబు రాకాసి పాలనగా మిగిలిన రాక్షస ప్రభుత్వంపై వైయస్‌ రాజశేఖరరెడ్డి పాదం బలిమీద వామనుడి పాదంలా పాతాళానికి అణగదొక్కింది. 
వైయస్‌ఆర్‌ తన సుదీర్ఘ అనుభవంతో ప్రజలకు మేలు చేయాలనే విశ్రాంతి లేకుండా రాష్ట్రంలో ఎక్కడ.. ఎప్పుడు.. ఎవరికి అపకారం జరిగినా.. ప్రజా సమస్యలు తీర్చుకుంటూ.. పోరాటం చేశారు. 
కుక్కలు చింపిన విస్తరిలా ఉన్న కాంగ్రెస్‌లో తానొక్కడే ఇంతింతై వటుడింతై అన్నట్లుగా కాంగ్రెస్‌కు వైభవం తీసుకొచ్చారు. వైయస్‌ఆర్‌ పాదయాత్రతో ఆంధ్రరాష్ట్ర రాజకీయాల్లో సమూలమైన మార్పులు వచ్చాయి. వైయస్‌ఆర్‌ పాదయాత్ర భారత రాజకీయాల్లో పెనుదుమారం లేపింది. వైయస్‌ఆర్‌ నాయకత్వ ప్రతిభ వల్ల ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమానురాగాల వలన మండుటెండల్లో 50 డిగ్రీల ఉష్ణోగ్రత్త ఉన్న సమయాల్లో కూడా యాత్ర సాగింది. ఆ పాదయాత్ర వల్లే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ చెప్పుకుంటున్నట్లుగా.. పార్టీ అధికారంలోకి తీసుకురాలేదు. వైయస్‌ఆర్‌ పాదయాత్ర వల్లే అధికారంలోకి వచ్చింది. 
రాజమండ్రిలో వైయస్‌ఆర్‌ ప్రాణాపాయ పరిస్థితిలో ఉండగా.. ఆనాటి సోనియాగాంధీ ఒరిస్సా పర్యటనకు వెళ్తూ విశాఖ ఎయిర్‌పోర్టులో దిగితే.. రోశయ్య వైయస్‌ఆర్‌ ఆరోగ్య పరిస్థితి వివరించి పరామర్శకు రమ్మని కోరినా.. ఎవరిని అడిగి పాదయాత్ర చేస్తున్నాడని కర్కషంగా మాట్లాడిందన్నారు. ఈ పాదయాత్ర ఆటంకం పర్చడానికి అనేక మంది నాయకులు అడ్డంకులు సృష్టించారు. విశ్వప్రయత్నం కాంగ్రెస్‌ పార్టీ వారే చేశారు. ఆయన పాదాలతో పునీతమైన ఆంధ్రరాష్ట్ర ప్రజల ఆధరాభిమానాల వల్ల వైయస్‌ఆర్‌నే ముఖ్యమంత్రి చేయాలనే ఆశీస్సులతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. 
వైయస్‌ఆర్‌ చేవెళ్ల నుంచి కదిలితే.. ఇచ్ఛాపురం వరకు గుడిసె గడిసెను పలకరిస్తూ.. గుండెల్లో నమ్మకాన్ని కలిగిస్తూ ప్రతి ఒక్క హృదయాలను తడుముతూ.. ఆప్యాయతతో నిమురుతూ.. ఆయన చేసిన పాదయాత్ర అరాచకాలకు పరాకాష్టగా మారి ఇలాంటి నాయకుడు మాకు కావాలనే నమ్మకం ప్రజల్లో తీసుకొచ్చారు. వైయస్‌ఆర్‌ మాట మంత్రమైంది. ఆయన అడుగు ఆదర్శమైంది. కేవలం వైయస్‌ఆర్‌ మాటలు బీజాక్షరాలుగా మారి ప్రజలను మంత్రముగ్దులను చేసి.. వైయస్‌ఆర్‌ తప్ప మా కష్టాలు ఎవరూ తీర్చలేరు అనే భరోసాను తీసుకొచ్చింది. ప్రజలు హక్కున చేర్చుకోవడం మూలంగా రాజన్న పాలన ప్రారంభమైంది.. రామరాజ్యం ఆవిష్కరించింది. 
పాదయాత్ర సమయంలో ప్రజల కన్నీళ్లు తూడుస్తూ నమ్మకం కలిగించిన వైయస్‌ఆర్‌. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగించారు. ఆనాడు సీతమ్మను చర నుంచి విడిపించడానికి రాముడు పాదయాత్ర చేస్తే.. చంద్రబాబు చర నుంచి ప్రజలను విడిపించేందుకు వైయస్‌ఆర్‌ పాదయాత్ర చేశారు. చంద్రబాబులా విలాస, నీరసయాత్ర, జాగరణ యాత్రలా కాకుండా మండుటెండలో ప్రజల కన్నీళ్లను తూడుస్తూ అనునిత్యం వేలాది మంది వెతలను చూస్తూ సాగిన పాదయాత్ర. 1475 కిలోమీటర్లు రాజశేఖరరెడ్డితో పాటు అడుగులో అడుగు వేసే అదృష్టం కలగడం నా జీవిత భాగ్యం. 
రాజకీయ ఔన్నత్యం, ఉన్నతమైన వ్యక్తిత్వం. ప్రజల కోసం బతికే వైయస్‌ఆర్‌ తపస్సు తెలుగు వారికి ఆదర్శప్రాయంగా నిలిచింది. పాదయాత్ర ఒక స్ఫూర్తి. ఆ పాదయాత్ర ద్వారా ప్రజలు ఇచ్చిన అధికారంతో ఆయన చేసిన మంచి పనులు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా మారి. దేవుడై అనునిత్యం ప్రతి ఇంటిలో పూజించే విధంగా మారిపోయారు. వైయస్‌ఆర్‌ మరణిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా వెక్కివెక్కి ఏడ్చారు. ఆ మరణాన్ని తట్టుకోలేక 670 మంది గుండెలు ఆగాయి. నదులను మళ్లించి రైతుల కాళ్లు కడిగి పొలాలకు నీరందించారో.. ఆ మరణాన్ని తట్టుకోలేక గోదావరి ఉప్పొంగింది. వైయస్‌ఆర్‌ మరణం సునామీలా మారింది. అది ప్రజారంజకంగా పాలించిన నాయకుడి ప్రతిభ. 

అప్పటికి 8 సంవత్సరాలుగా పరిపాలిస్తున్న చంద్రబాబుపై అలిపిరిలో నక్సలెట్స్‌ దాడి చేస్తే ప్రాణాలు పోయాయి అనుకునే సమయంలో అలిపిరిలో టీబండి కూడా ఆపలేదు. స్విమ్స్‌ ఆస్పత్రిలో బాబును చేర్చితే 500ల మంది పరామర్శించేందుకు కూడా రాలేదు. అలాంటి చంద్రబాబు నాది అత్యుత్తమ పాలన. నాకంటే పాలించే నాయకుడు లేడు అని రోజు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నాడు. మళ్లీ ఇప్పుడు పాడిందే పాడరా.. పాచిపళ్ల దాసరా అనే నిరంతరం చంద్రబాబు పాట వింటూనే ఉన్నాం. 

చంద్రబాబు పాలన రాష్ట్రానికి పట్టిన గ్రహణం. ఆ గ్రహణాన్ని సరిగ్గా 14 ఏళ్ల క్రితం పాదయాత్ర అనే ఆయుధంతో పాలన సిరస్సు ఖండించాడు. ఈ రోజున వైయస్‌ జగన్‌ మళ్లీ రాకాసి, రాక్షస, అవినీతి, బంధుప్రీతి పాలన శిరస్సును పాదయాత్రతో ఖండిస్తాడు. ప్రజలకు దీపావళి చూపిస్తాడు. వైయస్‌ఆర్‌ జీవితం, వ్యక్తిత్వం, నీతి, నిజాయితీ, ఉన్నత పాలన అనితర సాధ్యమైనది. ఇతరులెవరూ దరిదాపుల్లో కూడా చేయనటువంటిది. ఆ పాలనను, ఆ వ్యక్తిత్వాన్ని పునికిపుచ్చుకున్న ఏకైక వ్యక్తి వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఒక్కరే..