గడపగడపకూ సన్నద్ధం కావాలి
29 Jun, 2016 13:23 IST
విజయనగరం: జూలై 8వ తేదీ నుంచి చేపట్టబోయే ‘గడపగడపకూ వైఎస్సార్సీపీ’ కార్యక్రమానికి నియోజకవర్గం ఇన్‌చార్జీలు కార్యకర్తలను సన్నద్ధం చేయాలని ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. విజయనగరంలో జరిగిన పార్టీ సమావేశంలో కోలగట్ల మాట్లాడారు. ప్రజల అవస్థలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటంలో టీడీపీ సర్కార్ విఫలమైందన్నారు.