ప్రధానిని కలిస్తే మీకెందుకు కంగారు
11 May, 2017 11:07 IST
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన వైయస్ జగన్‌పై విమర్శలు చేసే స్థాయి మంత్రులు దేవినేని ఉమ, అచ్చెన్నాయుడుకు లేదని వైయస్‌ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందారెడ్డి అన్నారు. ప్రజా సమస్యలపై వైయస్ జగన్...ప్రధానిని కలిస్తే టీడీపీ ఎందుకు కంగారు పడుతోందని ఆయన ప్రశ్నించారు. దేశానికి అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే బాగుంటుందన్న జగన్ మాటల్లో తప్పేముందని ప్రశ్నించారు. ఎన్డీయే అభ్యర్థి రాష్ట్రపతి కావడం టీడీపీకి ఇష్టం లేనట్లు ఉందని బత్తుల బ్రహ్మానందరెడ్డి విమర్శించారు.