చీరాలలో బాలినేని పర్యటన
4 May, 2017 12:24 IST
చీరాలః వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి చీరాల పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త యడం బాలాజీ పార్టీ నాయకులు, కార్యకర్తలను కోరారు. వేటపాలం మండలం బాలాజీనగర్ యువతతో ఈ నెల 7వ తేదిన జరిగే ఆత్మీయ సమావేశానికి బాలినేని హాజరవుతారని స్పష్టం చేశారు. నియోజకవర్గ పరిధిలో పార్టీ కార్యక్రమాలు విధి విధానాలపై చర్చంచనున్నట్లుగా చెప్పారు. ఈ సమావేశానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.