ఐదు కోట్ల ఆంధ్రులకు వెన్నుపోటు
19 May, 2016 11:24 IST
విజయవాడః వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగిరమేష్ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హోదాను అడ్డుపెట్టుకొని బాబు 5 కోట్ల మందిని వెన్నుపోటు పొడిచారని జోగి రమేష్ ఫైరయ్యారు. ప్రత్యేకహోదా వల్ల ఆంధ్రకు ఒరిగేది ఏమీ లేదని మాట్లాడడం చంద్రబాబు దుర్మార్గాలకు, దుశ్చర్యలకు నిదర్శనమన్నారు. మోదీతో చంద్రబాబు ప్రత్యేక హోదాపై మాట్లాడారా లేదా..? కరువుపై ఎన్ని నిధులు అడిగారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.